Friday, June 13, 2008

ABOUT ME

నా గురించి నేను చెప్పు కొవటానికి పెద్దగా ఏమీ లేదండి
నేను అందరి లాగానే ఓ సగటు మనిషిని

మధ్య తరగతి మూగ జీవినీ నేను
పొట్ట కోసం ప్రాకూలదే అల్ప జీవీ ని నేను
ప్రపంచ జ్ఞానం తెలియని అమయ కుడిని నేను
అంతస్తు అనే అడ్డు గోడలు తెలియని అవివేకిని నేను
వంచన చేయటం తెలియని వెర్రి వాడిని నేను

ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు
వదిలేయండి రండి నాతో స్నేహం చేసి
నా గురించి మీరే తెలుసు కోండి సరేనా...................

నేను బారత ధేశాం లో పుట్టినాంధూకు గర్వ పడుతున్నాను
============================
నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను!


నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే.ఇంకొకటండి.. ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!!

"ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో "
అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..

కవితలు చెప్పే హృదయం వుంది !
ప్రేమించే మనసు వుంది
మనసులొన మంచి ఉహ వుంది
ఉహల లొకం లొ ఒక ఆశ వుంది
కలసి వుండే కోమలి యెక్కడ వుందొ?
చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....
********...................********
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....

1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...

2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...

6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...

7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...

చిరునవ్వుతో.

mee(tho/lo) Vasanth

Wednesday, June 11, 2008

Microsoft Silverlight

Microsoft Silverlight is a cross-browser, cross-platform, and cross-device plug-in for delivering the next generation of .NET based media experiences and rich interactive applications for the Web.

By using Expression Studio and Visual Studio, designers and developers can collaborate more effectively using the skills they have today to light up the Web of tomorrow.

Thotaramudu blog

http://thotaramudu.blogspot.com/